![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-401 లో.. కృష్ణ, ముకుంద , మురారి, ఆదర్శ్ అందరు ఇంటికొస్తారు. ఇక ముకుంద తన గదిలో ఉండి మురారితో దిగిన సెల్ఫీ ఫోటోలను చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి ఆదర్శ్ వస్తాడు. ముకుంద అని ఆదర్శ్ పిలవగానే తను ఫోన్ దాచేస్తుంది. ఇక అదర్శ్ వచ్చి.. నిన్న జరిగినదాని గురించి ఎక్కువగా ఆలోచించకు.. మన శోభనం కోసం నువ్వు ప్లాన్ చేశావ్ కానీ ఇలా జరిగింది ఏం పర్లేదు నువ్వు రెస్ట్ తోసుకో అని జ్యూస్ ఇస్తాడు. ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో.. మనం కలవాలని అనుకునున్నావ్ కదా అది చాలు నాకు అని ముకుందతో ఆదర్శ్ అంటాడు. ఇక అదర్శ్ గది నుండి వెళ్ళిపోయాక.. ఒక మనిషి ప్రేమ కూడా ఇంత భాదపెడుతుందా అనిపిస్తోందని ముకుంద అనుకుంటుంది.
మరోవైపు రేవతి కిచెన్ లో వంట చేస్తుంటుంది. తన దగ్గరకి కృష్ణ వచ్చి.. అత్తయ్య రైస్ పెట్టారా? ఏం కూర చేస్తున్నారని అడుగుతుంది. నేను చూసుకుంటా కదా.. నువ్వెందుకు వచ్చావ్? ప్రయాణం చేసి అలసిపోయారు కదా అని కృష్ణతో రేవతి అంటుంది. అలసిపోయేంత పెద్ద ప్రయాణమేమి కాదని కృష్ణ అంటుంది. అవన్నీ పక్కన పెట్డు గానీ ముకందకెలా ఉందని అడుగుతుంది. బాగానే ఉందని కృష్ణ అంటుంది. ఇంట్లో ఇంతమంది ఉండగా పెద్దతయ్య ఇంటి భాద్యత నాకే ఎందుకు అప్పగించింది? ముకుందని చూసుకోమని నన్నే ఎందుకు అంది? అసలు ముకుంద మారిందంటే ఎందుకు నమ్మట్లేదు? తను అమెరికా ఎందుకు వెళ్ళిందని కృష్ణ అడుగుతుంది. సరే అవన్నీ వదిలెయ్ గానీ ముకుంద మారిందంటే నువ్వు నమ్ముతున్నావా? కాస్త కూడా తన ప్రవర్తనలో అనుమానం కలగట్లేదా అని నువ్వు ఆ కోణంలో ఆలోచించు అని రేవతి అంటుంది. ఇక కృష్ణ ఆలోచనలో పడుతుంది. కాసేపటికి అందరు హాల్లో ఉండగా అక్కడికి పంతులు వస్తాడు. శోభనానికి ముహుర్తం పెట్టమని నేనే పిలిపించానని కృష్ణ అనగానే.. అందుకే అక్క ఇంటి భాద్యతలు నీకు అప్పగించిందని ప్రసాద్ వాళ్ళ భార్య అంటుంది. ఆ తర్వాత పంతులు ముహుర్తం చూస్తాడు. ఒక్క జంటకే ముహుర్తం ఉందని, అది ఆదర్శ్, ముకుందలకే ఉందని పంతులు గారు చెప్పగానే అందరు సంతీషిస్తారు. ముకుంద మాత్రం షాక్ అవుతుంది.
ఇప్పుడెందుకు ముహుర్తాలని ముకుంద అనగానే.. ఎందుకు వద్దంటున్నావని ప్రసాద్ వాళ్ళ భార్య, రేవతి అడుగుతారు. కాలు బెణికింది కదా అందుకే ఇప్పుడెందుకని అంటున్నా అని ముకుంద అనగానే.. తనకి ఇబ్బందిగా ఉంటే వద్దని పంతులుగారితో ఆదర్శ్ అనగానే.. నేను డాక్టర్ నే కదా.. అది పెద్ద గాయమేం కాదు.. సాయంత్రం వరకు తగ్గిపోతుంది. ఇదే ముహుర్తం ఖరారు చేయమని కృష్ణ అంటుంది. సరేనని పంతులు చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తరువాయి భాగంలో.. ముకుంద దగ్గరకి కృష్ణ వెళ్ళి .. నీకేదైన ప్రాబ్లమ్ ఉంటే ధైర్యంగా చెప్పమని అంటుంది. అదేం లేదని ముకుంద అంటుంది. ఇక అప్పుడే ముకుందకి కాల్ వస్తుంది. నా మొగుడు అనే నెంబర్ నుండి కాల్ వస్తుంది. అది చూసిన కృష్ణ షాక్ అవుతుంది. ఇక మురారి దగ్గరకి కృష్ణ వెళ్ళి.. ముకుందకి ఫోన్ చేశారా? ఎప్పుడు అని అడుగుతుంది. నువ్వు వచ్చేముందే చేశానని మురారి అనగానే కృష్ణ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |